అనూహ్య నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి…

ప్రధాని నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా విషయాన్ని సామాజిక అనుసంధాన వేదికలో బయటపెట్టి సంచలనం సృష్టించారు. వచ్చే ఏడాది గుజరాత్ లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ 75 సంవత్సరాల పైబడిన వారు పదవుల నుండి వైదొలగాలని ఆదేశించడంతో, నవంబర్ లో తనకు 75 సంవత్సరాలు నిండుతున్నందు వల్ల తనను పదవీ నుండి తప్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా ఆనందీ బెన్ పటేల్ ను తప్పిస్తారని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆమెనే స్వయంగా రాజీనామా చేయటం గమనార్హం.

Leave a Reply