తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్ర అనుమతులు తీసుకోవాలా?

తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి ప్రతిపక్ష కాంగ్రెస్,టిడిపిలపై ధ్వజమెత్తాడు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై ఆంధ్ర నాయకుల అనుమతి తీసుకోవాలని మహానాడులో వ్యాఖ్యానించిన రేవూరి ప్రకాష్ రెడ్డిపై మండి పడ్డాడు. తెలంగాణలో టిడిపి దుకాణం బంద్ అయ్యిందని అందుకే ఆంధ్రలో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చప్పట్లు కొట్టించుకుంటున్నారు అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలో ఉన్నపుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంపు భాదితులకు నష్టపరిహారం ఎంత ఇచ్చారో తాము ఎంత ఇస్తున్నామో తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తెలంగాణ ప్రజల అనుమతి ఉంటే చాలని వేరే ఎవరి అనుమతులు అవసరం లేదని హరీష్ రావు స్పృష్టం చేశారు.

Leave a Reply