ఇలా చేయడం వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు

తెలంగాణ రాష్ట్రమంతా హరిత హారం మొదలుపెట్టి మొక్కలు నాటి ఒక మంచి ఉద్యమానికి తెరతీస్తుంటే అందుకు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు ఆ కార్యక్రమాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకుల పని ఎప్పుడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడమే అన్న సంగతి నిజమే కాని ఇలా అయినడానికి కాని దానికి మంచి పనికి సమాజానికి ఉపయోగపడే పనులకి రాజకీయ బురద అంటిస్తే ప్రజల్లో మరింత చులకన కావడం తప్ప మరొక ఉపయోగం లేదు. విమర్శించడంలో తప్పులేదు కాని ప్రతి పనిని విమర్శించే ముందు అందుకు తగ్గ ఆధారాలు ఉండాలి కదా. ఇప్పడు ఎవరు ఏమన్నరనే కదా మీ ప్రశ్న.. అతనే  కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క .తాజాగా హరిత హారాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హరిత హారం కార్యక్రమం పెద్ద స్కాము అని కేవలం మొక్కలు నాటడంకోసం  కోట్ల మొక్కలు కొనుగోలు చేస్తున్నారని వాటికి లెక్కలు కూడా  లేవని గతంలో చేపట్టిన హరిత హారం మొదటి విడత కార్యక్రమానికి సుమారు వెయ్యికోట్ల్ల ఖర్చు చేసారని ఇప్పుడు ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయో వాటిని ఎవరు పర్యవేక్షిన్చారో కూడా తెలియదు అని ఆయన అన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన జానారెడ్డి ఈ కార్యక్రమంపై ప్రభుత్వానికి కితాబివ్వడం కూడా కొంత మేర పార్టీలో పొంతన కుదరట్లేదనే వాదన వినిపిస్తోంది.

Leave a Reply