తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ..

తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్లన్న ముంపు బాధితుల పరిహారం కోసం తీసుకువచ్చిన జీవో 123ను హైకోర్టు కొట్టివేసింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతుల నుండి నేరుగా భూములు తీసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చింది. అయితే కరీంనగర్ కు చెందిన కొంతమంది రైతులు వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు జీవో 123ను కొట్టి వేస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పుడు కోర్టు తీర్పుతో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. మెజారిటీ రైతులు జీవో 123 ప్రకారమే భూములు ఇచ్చారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Leave a Reply