న్యాయం కోసం సుప్రీం కోర్టుకైనా వెళతాం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో ఆయనను విచారించాలంటూ వైసీపీ ఎమ్మేల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. దానిపై స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు హై కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారించిన హై కోర్టు విచారణ ఆపాలంటూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుపై తెలుగు దేశం నేతలు హర్షం వ్యక్తం చేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, వైకాపా నేతలు మండిపడుతున్నారు. కాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.

Leave a Reply