మరో సారి ఎదురు దెబ్బ..

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రెండు రోజుల క్రితం 8 యూనివర్సిటీలకు వైస్ చాన్సీలర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై హై కోర్టు స్పందిస్తూ వీసీల నియామకంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం సంతృప్తిగా లేదంటూ వీసీల నియమాకాన్ని రద్దు చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు న్యాయస్థానంలో ఉండగానే ఎలా వైస్ చాన్సులర్ లను నియమిస్తారంటూ ఆగ్రహంతో పాటు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం సమీక్షించనుంది. కాగా గత రెండు సంవత్సరాలుగా హై కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే తెలంగాణకు ప్రత్యేక హై కోర్టు కావాలంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజా తీర్పుతో అవి మరింత పెరిగే అవాకాశం ఉంది.

Leave a Reply