పెరిగిన బస్ ఛార్జీల వివరాలు

సోమవారం నుంచి అమల్లోకి  టీఎస్ ఆర్టీసీలో పెరిగిన బస్ ఛార్జీలు ఈ కింది విధంగా ఉన్నాయి. సాధారణ ప్రయాణికుల బస్ పాస్ ల ధరలు 10 శాతం పెరిగాయి. ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లలో ఉమ్మడి ప్రయాణం బస్‌పాస్ ధర రూ. 800 నుంచి రూ.880కి పెంచడం జరిగింది. నగరంలో ఒక రోజు ప్రయాణించేందుకు జారీ చేసే టికెట్ ధర రూ. 70 నుంచి రూ. 80కి పెంచారు.

 • పల్లె ప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. వరకు రూ.1 పెంపు, 30 కి.మీ.దాటితే రూ.2 పెంపు
 • దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల్లో 8 పైసలు నుంచి 17 పైసలు పెంపు
 • సూపర్ లగ్జరీ బస్సుల్లో కి.మీ.కు 11 పైసలు
 • ఇంద్ర బస్సుల్లో కి.మీ.కు 14 పైసలు
 • గరుడ బస్సుల్లో కి.మీ.కు 16 పైసలు
 • గరుడ ప్లస్ లో 17 పైసలు
 • పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 5 నుంచి 6కు పెంచడం జరిగింది.
 • ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 నుంచి 11కు పెంపు
 • డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 17కు పెంపు
 • రాజధాని, గరుడ, గరుడ ప్లస్ లో కనీస ఛార్జీ రూ. 25 నుంచి రూ. 28కి పెంపు
 • వెన్నెల బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 50 నుంచి రూ. 55కు పెంపు
 • సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 6 నుంచి రూ. 7కు పెంపు
 • సిటీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ. 7 నుంచి రూ. 8కు పెంపు
 • మెట్రో డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 8 నుంచి రూ. 9కి పెంపు

పెరిగిన నెలవారీ బస్‌పాస్ ధరలు.. 

 • ఆర్డినరీ బస్ పాస్ ధర రూ. 700 నుంచి రూ. 770కి పెంపు
 • మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ ధర రూ. 800 నుంచి రూ. 880కి పెంపు
 • మెట్రో డీలక్స్ బస్‌పాస్ ధర రూ. 900 నుంచి రూ. 990కి పెంపు
 • ఎన్జీవోలకు ఇచ్చే ఆర్డినరీ బస్‌పాస్ ధర రూ. 235 నుంచి రూ. 260కి పెంపు
 • ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ ధర రూ. 335 నుంచి రూ. 370కి పెంపు
 • మెట్రో డీలక్స్ బస్‌పాస్ ధర రూ. 435 నుంచి రూ. 480కి పెంపు

 

Leave a Reply