గోల్కొండలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవాలు…

తెలంగాణలో స్వాతంత్రదినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.గోల్కొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ పతావిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసులకు పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఎంపీ కవిత, అధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 650 కళాకారులు ప్రదర్శనను నిర్వహించారు. అలాగే ఆని జిల్లా కేంద్రాల్లో మంత్రులు పతాకావిష్కరణ గావించారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణా రావు, రంగా రెడ్డి జిల్లాలో పీ. మహేందర్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి, నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి పతాకావిష్కరణ గావించారు. అలాగే మండలాల్లో ఆయా మండల పరిషత్ అధ్యక్షులు, పీఏసీఎస్ అధ్యక్షులు, తహసీల్దారులు, గ్రామాల్లో సర్పంచులు పతాకావిష్కరణ చేశారు.

Leave a Reply