పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..!

భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది.మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలో పెట్టుబడులు పెట్టె  విదేశీ పెట్టుబడుదాలను ఆకర్షించేందుకు కేంద్రం  కసరత్తు చేస్తోంది. దానిలో భాగంగా పెట్టుబడులతో మన దేశానికి వచ్చే విదేశీయులకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకు  వీసా గడువు తీరి పోతుంది. ఈ ఇబ్బందులు నుండి గట్టెంకించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిబంధనలతో కూడిన పౌరసత్వాన్ని 15 – 25 సంవత్సరాలకు ఇవ్వనున్నారు. అయితే ఇందుకోసం విదేశీ ఇన్వెస్టర్లు కొన్ని షరతులకు లోబడి ఉండాలి. భారత పౌరసత్వం పొందాలంటే భారీగా పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. కనిష్టంగా ఎంత మొత్తం ఎంతనేది తరువాత నిర్ణయిస్తారు. త్వరలో జరిగే  కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో కెనడా,  ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు విదేశీ పెట్టుబడిదారులకు పౌరసత్వం ఇచ్చే విధానాన్నిఅమలు చేస్తున్నాయి.

Leave a Reply