ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన పీవీ సింధు

ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధుకు క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సింధుతో పాటుగా రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ కు, జిమ్నాస్టిక్ లో త్రుటిలో పతకం కోల్పోయిన దీపా కర్మాకర్ కు, షూటర్ జీతూ రాయ్ కు కూడా ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ప్రకటించారు. దీపా కర్మాకర్ కోచ్ కు ద్రోణాచార్య అవార్డు ప్రకటించారు.మరోవైపు ఒలింపిక్స్ లో పతకం సాధించి తొలి సారిగా నగరానికి విచ్చేసిన పీవీ సింధును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.అనంతరం పీవీ సింధు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్ తో కలిసి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిశారు.

Leave a Reply