మనవాళ్ళు అమెరికాను దాటేశారు..

భారతీయులు ప్రతి విషయంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా భారత యువత అగ్ర రాజ్యాలకు తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. సాంకేతిక వినియోగం, సాంకేతిక విద్య విషయంలో అగ్ర రాజ్యాలను సైతం తలదన్ని ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక విషయానికి వస్తే సాంకేతిక విద్యలో భారతీయులు అమెరికన్ల కన్నా 10 రెట్లు ఎక్కువగా నేర్చుకుంటున్నారని ‘బార్క్లేస్ డిజిటల్ డెవలప్మెంట్ ఇండెక్స్’ సర్వేలో తేలింది. అంటే ఒక అమెరికన్ 10 గంటల్లో చేసే ప్రోగ్రామింగ్ ను ఒక భారతీయుడు సరాసరిగా కేవలం ఒక గంటలో మాత్రమే చేయగలడు. సర్వే తెలిపిన వివరాల ప్రకారం భారత్, చైనాలో సాంకేతిక పరిజ్ఞానం చాల వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు గనుక సాంకేతిక పరిశ్రమలకు తగిన ప్రోత్సాహాలు అందిస్తే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో మనదేశంతో పోటీ పడే దేశం ఏది ఉండకపోవచ్చు. అలాగే ప్రతి ఏడు కొన్ని లక్షల కోట్ల ఆదాయం మన దేశానికి వస్తుంది.

Leave a Reply