మధుమేహ భాదితులకు శుభవార్త అందించిన పరిశోధకులు..

నేడు ప్రపంచంలో అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాదిని ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ఈ వ్యాది మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. అవి టైప్ -1 డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్. టైప్ – 2 డయాబెటిస్ తో బాధ పడేవారు ప్రతి రోజు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ ప్రస్తుతం ఇంజక్షన్ ద్వారా మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఇలా తరచుగా ఇంజక్షన్ తీసుకోవడం వల్ల వచ్చే నొప్పిని భరించాల్సి ఉంటుంది. అయితే నయగారా యూనివర్సిటీ ప్రొఫెసర్ మేరే మెక్ కోర్ట్ పరిశోధక బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇన్సులిన్ టాబ్లెట్ ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఈ టాబ్లెట్స్ రక్తంలో సులభంగా కరిగే విధంగా ఫ్యాట్ కోటింగ్ తో తయారు చేశారు. కొలెస్తోసమ్ అనే అత్యాధునిక పద్దతిని ఉపయోగించి పిల్స్ తయారు చేసినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరే మెక్ కోర్ట్ తెలిపారు. ఎలుకలపై పరీక్షించిన ఈ మాత్రలు సత్ఫలితాన్ని ఇచ్చాయని, మరిన్ని జంతువులపై పరీక్షించి అందుబాటులోకి తెస్తామని పరిశోధక బృందం వెల్లడించారు.

Leave a Reply