అందుకే వారి ఆందోళన..

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ముంపు గ్రామాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడానికి ప్రతిపక్షాల వైకరే కారణం అని విమర్శించారు. టీడీపీ, సీపీఎం పార్టీలు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మించకుండా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు నీరందితే తమకు పుట్ట గతులు ఉండవని భయపడుతున్నారు అని విమర్శించారు. మల్లన్న సాగర్ కు సంబంధించి ఎనిమిది గ్రామాల్లో ఆర్ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారని వెల్లడించారు. ఏటిగడ్డ కిష్టాపూర్ లో ప్రతిపక్షాలు దీక్ష చేసిన చోటే ప్రస్తుతం రైతులు భూములు ఇస్తున్నారని వివరించారు. మిగిలిన రెండు గ్రామాల ప్రజలు కూడా భూసేకరణ పూర్తయితే తమ పని అయిపోయినట్లేనని భావించిన టీడీపీ,సీపీఎం పార్టీ నేతలు రాజీవ్ రహదారి పై ధర్నా చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైకరి మార్చుకోకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

Leave a Reply