అవినీతికి ఆస్కారం లేకుండా పనులు పూర్తి చేయాలి..!

తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ప్రాజెక్టులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా ప్రజలు కోరుకున్న విధంగా భూసేకరణ జరగాలని అధికారులను హరీష్ రావు కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకాలపై ప్రత్యెక శ్రద్ధ పెట్టాలని హరీష్ రావు అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యం అని హరీష్ రావు తెలిపారు.

Leave a Reply