అధికారులకు ఆదేశించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కౌంట్‌డౌన మొదలైందని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్‌ నుండి పనులను ప్రారంభించాలని కాంట్రాక్టు సంస్థలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. పనులను ప్రారంభించే నాటికి అన్ని రకాల యంత్రాలను,నిర్మాణ సామాగ్రిని నిర్మాణ స్థలాలకు తరలించుకోవాలని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం సమీక్షీస్తుండాలని, పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ అంశాలపై మంగళవారం స్టేట్‌ ఇరిగేషన డెవల్‌పమెంట్‌ కార్పొరేషన(టీఎ్‌సఐడీసీ) సమావేశ మందిరంలో అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు, కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని, ఈ  ప్రాజెక్టును సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని హరీశ్‌రావు అన్నారు. రిజర్వాయర్ల నిర్మాణ స్థలాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినందు వల్ల కాంట్రాక్టు ఏజెన్సీలు తమ క్యాంపులను అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపయోగించే యంత్రాలు, పరికరాల తరలింపు,మెషిన్ సెట్ , క్రషింగ్‌, బ్యాచింగ్‌ ప్లాంట్ల ఏర్పాటు వంటివి అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇసుక, ఇతర మెటీరియల్స్‌ వంటివి ఎంత అవసరం? వాటిని ఎక్కడి నుంచి తరలించాలి? అని అంచనా వేసి, నిర్మాణ స్థలాలకు తరలించుకోవాలని సూచించారు. నిర్మాణ ప్రాంతాల్లో కూలీలు అందుబాటులో ఉన్నారా? అన్నదీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని, వారం రోజుల్లోగా లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించగా, అందుకు ఏజెన్సీలు అంగీకరించాయి. ఆయా పనులకు సంబంధించిన అగ్రిమెంట్లను వారం రోజుల్లోనే పూర్తి చేసుకోవాలని  మంత్రి హరీష్ రావు సూచించారు.

Leave a Reply