నిందితులను శిక్షిస్తాం..

మహబూబ్ నగర్ జిల్లాలో ఇంజనీర్లపై జరిగిన దాడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై గట్టి చర్యలు తీసుకుంటామని హరీష్ రావు వెల్లడించారు. దాడికి పాల్పడ్డ వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించమని నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని హరీష్ రావు వెల్లడించారు. దీని పై ఇప్పటికే హోం మంత్రికి, డీజీపీకి పిర్యాదు చేశామని వెల్లడించారు. ఇంజినీర్లు ధైర్యంగా పని చేయాలని, తమ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు ఇంజనీర్లకు భరోసా ఇచ్చారు.

Leave a Reply