ఇక ప్రజాక్షేత్రంలోకి పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ ఇక నేరుగా ప్రజక్షేత్రంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ అగ్రహీరోల అభిమానుల మధ్య జరిగన ఘర్షణలో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. అబిమాని కుటుంబాన్ని పరామర్శించేదుకు పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతికి చేరుకున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే ఉండి బహిరంగ సభకు కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాన్ ఏం చేసిన అనూహ్యంగా చేస్తాడు అనేది మరోసారి ఆయన రుజువు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. గత ఎన్నికల్లోతెదేపా, భాజాపాతో పొత్తు పెట్టుకొని పరోక్షంగా వారి గెలుపుకు సహకరించారు. రేపు జరిగే బహిరంగ సభలో ఆయన ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply