బీజేపీకి గట్టి స్ట్రోక్ తప్పదా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరుపడి రెండు సంవత్సరాలు గడిచాయి. అయితే రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు ప్రతేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు రాజ్యసభలో బీజేపీయేతర పార్టీలు అన్ని తమ మద్దతును ప్రకటించాయి. బీజేపీ మాత్రం అది ద్రవ్య వినిమయ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టకుడదంటూ తప్పించుకోవాలని చూసింది.అయితే ప్రతి పక్షాలు పట్టు బట్టడంతో చర్చకు మాత్రం అంగీకరించి, ఓటింగ్ పెట్టలేమంటూ తేల్చి చెప్పింది. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై పవన్ కళ్యాణ్ సన్నిహితుల దగ్గర తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొంత కాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యక హోదా అంశంపై గట్టిగానే ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు మరో మాట చెబుతున్న బీజేపీకి గట్టి స్ట్రోక్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Leave a Reply