విడుదలకు ముందే రికార్డులు…

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం విడుదలకు ముందే అనేక రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ సాధించి మిగిలిన టాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. కేవలం 6 గంటలలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కూడా రికార్డు రేటుకు అమ్ముడయ్యాయి. 12.5 కోట్లు చెల్లించి మా టీవీ వారు జనతా గ్యారేజ్ రైట్స్ ను కొన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక రికార్డు. ఇప్పటికే జనతా గ్యారేజ్ పై అంచనాలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో సినిమా హిట్ కొడితే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగానే కనబడుతుంది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు.

Leave a Reply