ఓటుకు నోటు కేసు నిందితుడు మత్తయ్య సంచలన వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా చార్జీ షీట్ లో పేర్కొన్న జెరూసలేం మత్తయ్య ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, తనను చంద్రబాబు అవసరానికి వాడుకున్నాడని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక వివరాల్లోకి వెళ్తే తనకు ప్రాణ హాని ఉందంటూ ఢిల్లీలోని మానవ హక్కుల కమీషన్ ను మత్తయ్య ఆశ్రయించారు. తనకు ఏమైనా జరిగితే మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే అని ఆయన తెలిపారు. అదే విధంగా కేసీఆర్కూడా భాధ్యుడేఅని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో తనను బలిపశువును చేశారని ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణ హాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని మత్తయ్య మానవ హక్కుల కమీషన్ ను కోరారు. చంద్రబాబు బాగోతం అంతా సుప్రీమ్ కోర్టులో తన లాయర్ వెల్లడిస్తారని మత్తయ్య తెలిపారు.

Leave a Reply