దేశంలో మోడీక్రసీ మాత్రమే ఉంది..

జేఎన్ యూ విద్యార్థీ సంఘం నేత కన్హయ్య కుమార్ మరోసారి కేంద్రంలోని  మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విభిన్న సంస్కృతులు కల భారత దేశంలో ఒకరి ఆలోచనలను అందరిపై రుద్దోదని కన్హయ్య కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాలని కన్హయ్య కుమార్ పిలుపునిచ్చారు. దేశంలో దళితులు, మహిళల హక్కుల గురుంచి చర్చించాల్సిన అవసరం ఉందని కన్హయ్య అభిప్రాయపడ్డారు. నియంతృత్వ ధోరణితో వెళ్తున్న మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఎఫ్ డీ ఐ లు తీసుకొస్తున్నారని విమర్శించారు.మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సంపన్నులను మరింత సంపన్నులుగా, బీద వారిని మరింత బీద వారిగా మారుస్తున్నాయి అని తెలిపారు. హిందుత్వ శక్తులు బీఫ్ అంశాన్ని వాడుకొని మైనార్టీలు, దళితులపై దాడులకు తెగబడుతున్నారని, విభిన్న సంస్కృతులు కలిగిన దేశంలో ప్రజలు వివిధ ఆచారాలు పాటిస్తారని కన్హయ్య పేర్కొన్నారు. దేశంలో సామాజిక,రాజకీయ,ఆర్ధిక సమానత్వం కోసం పోరాడాలని, మనువాడ జాతెయవాదాన్ని పారద్రోలాలని కన్హయ్య పిలుపునిచ్చారు.

Leave a Reply