జూనియర్ ఎన్టిఆర్ పై నందమూరి అభిమానుల కోపం..!

యంగ్ టైగర్ ఎన్టిఆర్ ఈ మధ్య తన ప్రమేయం లేకుండానే అనవసరంగా నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్టిఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రాలు ఒకే సారి విడుదల అవ్వడంతో నందమూరి అభిమానుల మధ్య చీలికలు వచ్చాయి. ఇప్పటికే నందమూరి అభిమానుల్లో ఎన్టిఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు అంటూ చీలిక వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సిని మా అవార్డ్స్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెంపర్ చిత్రంలో నటనకుగాను ఎన్టిఆర్ ఉత్తమ నటుడి అవార్డును చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. సందర్భంగా ఉద్వేగంగా ప్రసంగించిన ఎన్టిఆర్ చిరంజీవి తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఫంక్షన్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది అయితే వెంటనే తేరుకున్న ఎన్టిఆర్ తనకు తాత ఎన్టిఆర్, బాబాయ్ బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ కూడా ఇన్స్పిరేషన్ అని ప్రకటించారు. అయితే చిరంజీవి తర్వాత సీనియర్ ఎన్టిఆర్, బాలకృష్ణల గురుంచి ప్రస్తావించడాన్ని నందమూరి అభిమానులు తప్పు పడుతున్నారు. అయితే ఎన్టిఆర్ మద్దతుదారులు మాత్రం వేదికపై ఉన్న వారికి మర్యాద ఇవ్వడం సముచితం అని భావించడం వల్లే ఎన్టిఆర్, చిరంజీవి గురుంచి ముందుగా ప్రస్తావించారు అని పేర్కొంటున్నారు.

 

Leave a Reply