కబాలి క్లైమాక్స్ చేంజ్

జూలై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అప్పటివరకు ఆపిన సినీ సునామి కబాలి విడుదల అనంతరం ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించినా పరవాలేదనిపించింది. నిరాశ చెందడానికి కారణాలు అనేకం.ముందుగానే భారీ స్థాయిలో కథపై అంచనాలు పెట్టుకోవడం తప్పకుండా రజనీకాంత్ మళ్ళీ బాషా రేంజ్ లో హిట్ కొడతాడని కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం యావత్తూ ఎదురుచూసింది. అయితే సినిమా విడుదల అయ్యాక మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. అయితే క్లైమాక్స్ కొద్దిగా సస్పెన్స్ గా ఉంచాలని చేసాడో లేదా మరేదైనా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడో తెలియదు కాని క్లైమాక్స్ అలా అర్ధాంతరంగా ఆపేయడం కాస్త విభిన్నంగా అనిపించినా క్లారిటీ లేదు. అయితే మలేషియా లో కూడా విడుదలైన ఈ సినిమా లో ఈ చిత్ర క్లైమాక్స్ గురించి అక్కడి మీడియా వ్యతిరేకంగా వక్రీకరించి రాసిందని దీనిప్రభావం తప్పకుండా ప్రేక్షకులపై పడుతుందని అందుకే క్లైమాక్స్ ని చేంజ్ చేసారట.. చివరలో రెండు సీన్స్ కలిపి చివరికి కథకి శుభం కార్డు వేసేసారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అదే క్లైమాక్స్ ఇక్కడ కూడా మారుస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Leave a Reply