చంద్రబాబుపై కాపు నేతల సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాపు ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాధం నాటకీయ పరిణామాలతో మరోసారి ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టడంతో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపు సంఘం నేతలు రాజకీయ పక్షాలకు అతీతంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దాసరి నారాయణరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాసరి నారాయణరావు సున్నిత మైన సమస్యను ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించాలని, ఉగ్రవాద సమస్యగా చిత్రికరించ వద్దని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా ప్రసారాలను నిలిపివేసి, ముద్రగడను కలవనీయకుండా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని, అసలు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే గోదావరి జిల్లాలో ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు.

Leave a Reply