ఎవరి వల్ల వచ్చిందో తేల్చి చెప్పిన సర్వే ..

[pullquote]తెలంగాణ తన వల్లనే వచ్చిందని మాజీ ఎంపీ, అప్పటి యూపీఏ హాయంలోని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు[/pullquote]తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దీగిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఒక రకంగా సాగిన తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఆమరణ దీక్షతో మలుపు తీసుకుంది. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి కల్పించారు. దాంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కేసీఆర్ వల్లనే వచ్చిందని తెలంగాణలోని మెజారిటీ ప్రజలు నమ్ముతారు. అయితే తెలంగాణ తన వల్లనే వచ్చిందని మాజీ ఎంపీ, అప్పటి యూపీఏ హాయంలోని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ఇస్తే ఇవ్వండి లేకుంటే ఇవ్వమని చెప్పండి అని సోనియాగాంధీ గట్టిగా అడిగానని, మీ బర్త్ డే కానుకగా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించండి అంటూ కోరానని, దానికి స్పందించిన సోనియా గాంధీ, చిదంబరం చేత విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటింప చేశారు అని సర్వే వెల్లడించారు. తాను కోరినందువల్లే సుశీల్ కుమార్ షిండే బిల్లు ప్రవేశ పెట్టారని, స్పీకర్ బిల్లును ఆమోదించినట్లు సర్వే పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం చేసింది ఏమి లేదని, ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కేసీఆర్ కూతురు,అల్లుడు విదేశాల్లో ఉన్నారని వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని సర్వే సత్యనారాయణ వివరించారు.

Leave a Reply