పుష్కర స్నానం చేసిన ముఖ్యమంత్రులు…

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గొందిమల్లలో పుష్కర స్నానం ఆచరించారు. ఇరువురు ఒకే సమయంలో పుష్కర స్నానం చేయడం గమనార్హం. పండితులు కృష్ణమ్మకు హారతిని ఇచ్చారు.పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పుష్కరాల కోసం ఏర్పాట్లు చేసిన వసతులపై భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం అనంతరం ఆలంపూర్ జోగుళాంబ దేవిని దర్శించుకున్నారు. పుష్కరాల సందర్భంగా కృష్ణా నది పరిసర ఆలయాల్లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్రలో కూడా కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.

Leave a Reply