జగన్ ను విడిచి ఉండలేను – కేవీపీ రామచందర్ రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రియ మిత్రుడు, ఆత్మ బంధువు కేవీపీ రామచందర్ రావు గురుంచి తెలియని వారుండరు. అంతగా ఆయన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. వైఎస్ మృతి తర్వాత ఆయన కొడుకు జగన్ సొంతంగా పార్టీ పెట్టినప్పటికి, కేవిపి అందులోకి వెళ్ళకుండా కాంగ్రెస్ లోనే కొనసాగారు. గత కొంత కాలంగా రాజకీయాల్లో స్తబ్దుగా ఆయన, రాజ్యసభలో ప్రత్యేకహోదా బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా మళ్ళి వెలుగులోకి వచ్చారు. ఈ మధ్య ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన్ ఇంటర్వ్యూలో కేవీపి మాట్లాడుతూ జగన్ నా మేనల్లుడు, వాడు లేకుండా నేను ఎలా ఉంటాను అని పరోక్షంగా తాను జగన్ తోనే ఉంటాను అని వ్యాఖ్యానించాడు. మరోవైపు వైసిపి శ్రేణులు కుడా కేవీపీ రాకను ఆహ్వానిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో పార్టీకి కేవీపీ లాంటి వారి అవసరం ఎంతో ఉందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply