తెరాసలోకి మల్కాజ్ గిరి తెదేపా ఎంపి మల్లారెడ్డి..?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం కేవలం ముగ్గురు ఎమెల్యేలు, ఒక ఎంపి మాత్రమే మిగిలారు. తెలుగుదేశం పార్టీ తరపున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి పోటి చేసి విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దిక్కు లేకుండ ఉండడంతో ఆయన పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలతో చర్చించిన మల్లారెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 న ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తెరాస గూటికి చేరేందుకు సిద్దం అయినట్లు సమాచారం. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బే.

Leave a Reply