ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై విషం కక్కుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలంగాణ సాగునీటి మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ప్రాజేక్ట్లులు మొదలు పెడుతుంటే చంద్రబాబు కడుపు మంటతో కేంద్రానికి ఫిర్యాదు చేస్తా అంటున్నాడు. తెలంగాణకు రావలసిన వాటా నీటిని ఉపయోగించుకొనే మేము ప్రాజెక్టులు కట్టుకున్తున్నాం, కృష్ణా నది నుండి ఇంకో 150 టిఎంసిల నీటి కోసం న్యాయ పోరాటం కొనసాగిస్తున్నాం అని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంది అని ఆరోపిస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాజెక్టులు అన్ని నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి అని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే మొదలుపెట్టారని తెలిపారు. అసలు ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అన్ని గత పాలకులు ప్రారంభించిన ప్రాజెక్టులేనని, వారు అమలు చేసిన జీవోలనే తాము అమలు చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. అసలు ఎవరి అనుమతి తీసుకొని పట్టిసీమ, పోతిరెడ్డి పాడు వంటి ప్రాజెక్టులు వంటి ప్రాజెక్టులు కట్టారని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్ కు అన్యాయంగా గోదావరి నీటిని తరలిస్తూ జలదోపిడి చేస్తున్న చంద్రబాబు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై పిర్యాదు చెయ్యాలి అని నిర్ణయించుకోవడం విడ్డూరం అన్నారు.

Leave a Reply