నేను వీఐపీ …..

దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక మంత్రి చేసిన పనికి మనకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందా లేక ఇంకా బానిసత్వంలోనే బ్రతుకుతున్నామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన స్వాతంత్ర వేడుకల్లో ఒక పొలిసు అధికారి చేత తన చెప్పులు తోడిగించుకున్నారు. అందరు టీవీలో చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఇక విషయానికి వస్తే ఒడిశా మంత్రి జోగేంద్ర బేహెరా జెండా వందన కార్యక్రమంలో భాగంగా చెప్పులు విడిచి పతాకావిష్కరణ గావించారు. అనంతరం అక్కడే ఉన్న సెక్యూరిటీ చేత చెప్పులు తోడిగించుకున్నారు. దాంతో వివాదం చెలరేగింది. అక్కడే ఉన్న టీవీ వారు సైతం జెండా వందనాన్ని వదిలేసి మంత్రి చెప్పులు తోడిగించుకుంటున్న దృశ్యాల్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిపై మాట్లాడిన మంత్రి తాను వీఐపీనని చెప్పులు తోడిగించుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. మంత్రి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply