అయ్యప్ప సొసైటీ ఘటనే ఆఖరిది కావాలి..

స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నేడు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వచ్ఛ ఆటోలను పంపిణి చేశారు. మొత్తం 176 ఆటోలను పంపిణి చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ ను ఆదర్శ నగరంగా తీర్చి దిద్దుతున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి అత్యాధునిక వాహనాలను సమకూరుస్తామని, పాత వాహనాలను దశల వారిగా తొలగిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 1824 ఆటోలు, ఇప్పుడు ఇంకో 176 ఆటోలను సిబ్బందికి ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయ్యప్ప సొసైటీలో జరిగిన మ్యాన్ హోల్ ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయ్యప్ప సొసైటీ ఘటనే ఆఖరిది కావాలని, యంత్రాల సాయంతో మ్యాన్ హోల్ శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ కార్మికులకు మాస్క్ లు, గ్లోవ్స్ సమకుర్చుతామని కేటీఆర్ తెలిపారు.

This slideshow requires JavaScript.

Leave a Reply