సిరిసిల్లలో హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు  సిరిసిల్లలో హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు.రాష్ట్రవ్యాప్తంగా హరిత హారం కార్యక్రమం ఉద్యమంలా ప్రజలంతా చేపట్టారు. ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులు ఇలా రాష్ట్రమంతా ఒక మంచి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. సమాజ హితం కోరి పర్యావరణ రక్షణకై ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ చాలా గొప్ప విషయం. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మొక్కలను నాటి ఆ ప్రాంత ప్రజలతో హరితహారంలో భాగస్వామ్యులు కానున్నారు.

Leave a Reply