హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష…

హైదరాబాద్ నగరంలో హెచ్‌ఎండీఏ చేపడుతున్న పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు.బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కార్యాలయంలో జరిగిన ఈ  సమీక్షకు హెచ్‌ఎండీఏ అధికారులు తమ ప్రాజెక్టు రిపోర్టులతో హాజరయ్యారు. హుస్సేన్‌సాగర్ ను ప్రక్షాళన, సుందీరకరణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్అధికారులతో చర్చించారు. ఎగువ ప్రాంతాల నుండి హుస్సేన్‌సాగర్‌కు చుక్కా మురుగునీరు కూడా రాకుండా చేసేందుకు బేగంపేట ప్రకాష్‌నగర్ ఐ అండ్ డీ స్ట్రక్షర్ నిర్మాణ ప్రతిపాదనకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి అధికంగా పడుతున్న నేపథ్యంలో రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్ (టీవోడీ)లపై అధికారులు ఇచ్చిన డీపీఆర్‌లపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంలో వాహనదారులకు మరింత భద్రతను కల్పించడం కోసం జైకా సహాయంతో చేపట్టనున్న టోల్ మేనేజ్‌మెంట్ సిస్టం (టీఎంఎస్), ఐటీఎస్, హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (హెచ్‌టీఎంఎస్), రూ. 30కోట్లతో  గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో ఎల్‌ఈడీ ప్రాజెక్టు అమలులో మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మూసీ సుందరీకరణలో భాగంగా బాపుఘాట్ ప్రాజెక్టు మరియు ఉప్పల్ భగయత్ సమీపంలోని మూసీ తీరంలో సుందరీకరణపై చర్చించారు.

Leave a Reply