తెలంగాణలో ఒక ఆంధ్ర పార్టీ ఖాళీ

తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పూర్తిగా అంతర్థానం అయ్యింది. వైఎసార్సిపి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ్యుల వలసలతో సతమతం అవుతుంటే తెలంగాణలో ఏకంగా వైఎసార్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం అయ్యింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమేల్యేల్లో ఇప్పటికే ఇద్దరు తెరాస గూటికి చేరారు. ఇక మిగిలిన ఏకైక ఎమెల్యే, ఆ పార్టీ తరపున గెలిచిన ఖమ్మం ఎంపి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటిఆర్ తో జరిగిన చర్చల అనంతరం వైఎసార్సిపిని తెరాసలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణలో వైఎసార్సిపి పూర్తిగా కనుమరుగు కానుంది.

Leave a Reply