తెలంగాణకు సరికొత్త ఎన్నారై పాలసీ…?

తెలంగాణా ఐటి, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణలో లో పెట్టుబడులను పెట్టేందుకు ఎన్నారై పాలసీని తీసుకు రావాలని యోచిస్తున్నారు. అందుకోసం ఎన్నారైలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 27న బేగంపేటలోని హరిత ప్లాజాలో మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నారై సంఘాలు, ఎన్నారై ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నారైల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నారైలు తమ సలహాలు, సూచనలు లిఖిత రూపంలో ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సమావేశానికి హాజరు కాని వారు minnri@telangana.gov.in కు తమ అభిప్రాయాలు సూచనలు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.ఈ సమావేశానికి సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం కోసం 040-23450455 నెంబర్ కు ఫోన్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

Leave a Reply