ఆయన భద్రత పూర్తిగా పాకిస్థాన్ ప్రభుత్వానిదే అంటున్న భారత్…

సార్క్ సమావేశాల్లో పాల్గొనడానికి భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే కాశ్మీర్ లోయలో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న సమయంలో ఈ పర్యటన ఇరు దేశాల్లో తీవ్ర ఉత్కంటను రేపుతుంది. ఇప్పటికే హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సలాహుద్దీన్ రాజ్ నాథ్ పాకిస్థాన్ లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అలాగే జమాత్-ఉద్-దావా చీఫ్, 2008 ముంబై పేలుళ్ళకు అసలు సూత్రధారి హఫీజ్ సయీద్ మాట్లాడుతూ కాశ్మీర్ లో అమాయక ప్రజల మరణానికి రాజ్ నాథ్ సింగ్ కారణమని, ఆయన పాకిస్థాన్ లో పర్యటిస్తే కాశ్మీర్ ప్రజల మనసులు గాయ పడతాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆగష్టు 3న తీవ్ర ఆందోళనలు చేస్తామని హఫీజ్ సయీద్ ప్రకటించారు.అయితే ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాజ్ నాథ్ పర్యటన విషయంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని ఆయన భద్రత పూర్తిగా పాకిస్థాన్ ప్రభుత్వానిదే అని భారత విదేశంగ శాఖ తెలిపింది.

Leave a Reply