శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన ప్రభుత్వం

మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఒకరోజు పాటు నిలిపేసేందుకు కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. కశ్మీర్ లోయలో కొన్ని నియంత్రణ పరిధిలో ఉన్న ప్రాంతాలలో  శనివారం మొబైల్ ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకు నియంత్రణ విధించాల్సివచ్చిందనే విషయానికి సమాధానంగా నిన్న అనంతనాగ్లో జరిగిన మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బర్హణ్ వనీతో పాటు మరో ఇద్దరిని భద్రత దళాలు కాల్చిచంపిన ఘటనను కారణంగా చూపింది.. ఈ సంఘటన నేపథ్యంలో శాంతిభద్రలను కాపాడేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.కేవలం సంఘ విద్రోహశక్తులు వదంతులు ప్రచారం చేయకుండా ఉండేందుకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసినట్లు వారు తెలిపారు.పుల్వామా జిల్లా,ఆ ప్రాంత పరిసరాల చుట్టుపక్కల అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో ఈ రోజు జరగాల్సిన స్కూలు బోర్డ్ పరీక్షలన్నింటినీ వాయిదా వేశారు.

Leave a Reply