మోత్కుపల్లి కోరిక చంద్రబాబు తీరుస్తాడా..?

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న సీనియర్ నేతలలో మోత్కుపల్లి ఒకరు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి విదేయుడిగానే ఉన్నాను అని చెప్పుకుంటుంటారు. అయితే మోత్కుపల్లి మహానాడులో చేసిన ప్రసంగం అందర్ని ఆకట్టుకుంది. తాను తెలంగాణలో పార్టీ కోసం ఒంటరిగా పోరాడానని తనను పార్టీ గుర్తుంచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఇప్పటికైనా తాను పార్టీ ఆదరించాలని కోరారు. అయితే మోత్కుపల్లి ప్రసంగం అందర్ని కదిలించినా, తెదేపా అధినేత చంద్రబాబును మాత్రం కదిలించలేక పొయింది. గతంలో మోత్కుపల్లిని గవర్నర్ చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు కనీసం ఆయన పరోక్షంగా కోరిన రాజ్యసభ సీటును కుడా ఇవ్వలేకపోతున్నాడు. పైగా మోత్కుపల్లి మాట్లాడుతుంటే సమయం అవుతుందని తొందరగా ముగించమని కోరాడు. మరోసారి మోత్కుపల్లి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. పార్టీలో ఇన్ని అవమానాలు జరుగుతున్నా మోత్కుపల్లి ఇంకా పార్టీలో కొనసాగుతుండడం విశేషమే.

Leave a Reply