తెలుగు దేశం పార్టీకి భారీ షాక్

తెలుగు దేశం పార్టీ జాతీయ పార్టీగా తీర్చిదిద్దగలిగానని ఎప్పటికైనా అత్తున్నత పార్టీగా తెలుగు దేశాన్ని తయారుచేస్తాను అని ఎప్పుడు చెప్పే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది.తాజాగా చంద్రబాబు తనయుడు పార్టీలో కీలకమైన నేత అయిన నారా లోకేష్ పేరు వికీలీక్స్ లో ఉండటమే.. ఏ నేరం చేసాడో ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందో అనుకోకండి. ఎందుకంటే వికీ లీక్స్ లో నారా లోకేష్ గురించి కాస్త విభిన్నమైన చర్చ జరిగింది.ఆ చర్చ ఈమెయిలు రూపంలో జరిగినట్లు ఒక పేపర్ లో వికీ లీక్స్ బయటపెట్టింది. ఇదేమి పెద్ద నేరం కాదు. కానీ విషయం ఏమిటంటే చంద్రబాబు తనయుడు నారాలోకేష్ గత ఏడాది అమెరికా అద్యక్షుడు ఒబామా ని కలిసి తనతో పాటు ఫోటో దిగిన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్న నారా లోకేష్ గురించి ఈమెయిలు ద్వారా నారా లోకేష్ ఎవరు అని  ప్రశ్నించగా అందుకు బదులుగా లోకేష్ కు సంబందించిన వికీ పెడియా పేజి లింక్ ను పంపారట అధికారులు. అయితే నారా లోకేష్ గురించి తెలుసుకోవడానికి ఒబామా ఆసక్తి కనపరిచారని ఆయా ఈమెయిలు సంబధిత డేటా ను వికీ లీక్స్ విడుదల చేసిందట.. అయితే ఈ విషయం తమకి అనుకూలమో లేదా ప్రతికూలమో తెలియక తెలుగు దేశం పార్టీ గందరగోళంలో ఉందట.

Leave a Reply