తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేస్తున్నారనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జలమండలి అధికారులు షాక్ ఇచ్చారు. అయన బంజారహిల్ల్స్ రోడ్ నెంబర్ 24లో అద్దెకు ఉంటున్న  ఇంటికి నీటి సరాఫరా నిలిపివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు అధికారిక కార్యక్రమాలు అన్ని విజయవాడ నుండే చేసుకుంటున్నారు. ఆయనకు విజయవాడలో ఒక క్యాంపు కార్యాలయం ఉంది,అలాగే హైదరాబాద్ లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను కుడా క్యాంపు కార్యాలయంగా వాడుతున్నారు. చంద్రబాబు ఇంతకు ముందు బంజారహిల్ల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండేవారు. తర్వాత ఆ ఇంటిని కూల్చి కొత్తగా కట్టుకుంటున్నారు. ఈ ఇంటికి నిర్మాణ అనుమతుల విషయంలో , అలాగే నీటి సరఫరా విషయంలో కూడా ఇబ్బంది రావడంతో ఇంట్లోనే బోర్ వేయించుకుని వినియోగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన బంజారాహిల్ల్స్ రోడ్ నెంబర్ 24లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటికి హైదరాబాద్ జలమండలి వాళ్ళు నెలకి 4.50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసే వారు. ఇప్పుడు చంద్రబాబు విజయవాడలో ఉన్న క్యాంపు కార్యాలయం నుండి లేకపోతే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుండి పరిపాలన కొనసాగిస్తుండడంతో ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి నీటి సరఫరా ఆపివేశారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు మాత్రమే 2.31 లక్షల నీటిని సరఫరా చేస్తున్నారు.

Leave a Reply