వోటుకు నోటు అనుభవం ఉంది కదా..!!!

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై  విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర వైఎసార్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి 1500 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి వైఎసార్సిపిని తెరాసలో విలీనం చేశారు అని ఆరోపించారు.పొంగులేటి శ్రీనివాస్ వైకాపా ను విడిచి అధికారపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో సిఎం కెసిఆర్ సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అటుపక్క ఆంధ్ర ప్రదేశ్లో కూడా భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ కెసిఆర్ ఎన్ని కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎంపిలను కొనేందుకు వాడారో తెలిసిన రేవంత్ కి తన బాస్ చంద్రబాబు అక్కడి వైకాపా ఎమ్మెల్యేలను ఎంత పెట్టికొన్నారనే విషయం తెలియదా? రేవంత్ అన్నట్లు ఓకే ఎంపి ,ఒక ఎమెల్యేకు 1500 కోట్లు కెసిఆర్ ఇస్తే, మరి టిడిపిలోకి  వస్తున్న ఎమెల్యేలకు చంద్రబాబు ఎంత ఇస్తున్నాడో చెప్తే బాగుండేది.ఎందుకంటే ఒక ఓటు కోసం 5 కోట్లు బేరం మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి కి చంద్రబాబు కి ఆ లెక్కలు అందరికంటే బాగా తెలుసు అని ఇటు తెరాసా కార్యకర్తలు అటు వైకాపా కార్యకర్తలు రేవంత్ పై తీవ్రంగా మండిపడుతున్నారు మరి.

Leave a Reply