వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని..

పాకిస్తాన్ కాశ్మీర్ పై మరోసారి తన దురాశను చాటుకున్నది. కాశ్మీర్ లో గత కొన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.దీనిపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు అని, వారి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, పాకిస్తాన్ లో కాశ్మీర్ ను కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.అలాగే కాశ్మీర్ కు నిజ నిర్దారణ కమిటీని పంపించవలసిందిగా ఐక్యరాజ్యసమితిని షరీఫ్ కోరారు. అయితే షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మందిపడ్డది. అసలు తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ ఎవరు అని ప్రశ్నించింది. పాకిస్తాన్ కే కాదు ఏ దేశానికి కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు హక్కు లేదని ఘాటుగా జవాబు ఇచ్చింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తమ బుద్దిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించింది.

Leave a Reply