కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్థాన్..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ పై చేసిన వ్యాఖ్యలతో ఆ దేశానికి వణుకు పుట్టింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని స్పష్టం చేసిన మోడీ ఇక చర్చించాల్సింది పీవోకే గురించే అని ఖరాఖండీగా తెలిపారు. అలాగే బలూచిస్తాన్ ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఎప్పుడు కశ్మీర్ గురించి రచ్చ చేసే పాకిస్థాన్ కు మోడీ ఎదురుదాడి చేయడంతో దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి తన దుష్ట పన్నాగాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇప్పుడు మరోసారి చర్చల పేరుతో మరో నాటకానికి తెర తీసింది. కశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్‌లో చర్చిద్దాం అంటూ భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జై శంకర్‌ కు, పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి సోమవారం నాడు ఆహ్వానించారు. పాకిస్థాన్‌ లోని భారత హై కమిషనర్‌ ను ఐజాజ్ చౌదరి పిలిపించి జై శంకర్‌ను అడ్రస్ చేసి ఉన్న ఆహ్వానాన్ని అందజేశారు. జమ్మూ – కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను అనుసరించి ఇరుదేశాలు పరిష్కరించు కోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆ లేఖలో పాకిస్థాన్ పేర్కొంది. ఈ వివాదాన్ని ఒక ‘అంతర్జాతీయ అనివార్యత’గా పాకిస్థాన్ అభివర్ణించింది.

Leave a Reply