పాకిస్థాన్ వికృత చేష్టలు..

పాకిస్థాన్ తన అసలు రూపాన్ని బయటపెట్టుకుంది. హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ ఎన్ కౌంటర్ తో కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్థాన్ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. భారత సైన్యం, భద్రత దళాల చేతిలో చనిపోయిన వారికి సానుభూతిని ప్రకటిస్తూ, భారత్ కు వ్యతిరేకంగా ఏకంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సార్క్ సమావేశాల కోసం పాకిస్థాన్ కు వెళ్తే అక్కడ ఆయనను ఘోరంగా అవమానించాలని చూసిన పాకిస్థాన్, ఇప్పుడు పాకిస్థాన్ లో పెషావర్ – కరాచీ మధ్య దాదాపు 4000 కోలోమీటర్లు తిరిగే ఆజాదీ ఎక్స్ ప్రెస్ రైలును మొత్తం ఖాళీ లేకుండా బుర్హాన్ పోస్టర్ లను అంటించి తన అసలు రూపాన్ని బయట పెట్టింది.

Leave a Reply