ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. చర్చలు సమగ్రంగా జరిగేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు.ఆగష్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని, ఆ వేడుకకు ముందుగా ఈ సమావేశాలు జరుగుతుండడం ఒక మైలు రాయి అని మోడీ పేర్కొన్నారు. ప్రస్తుత సమావేశాల్లో 20 బిల్లుల వరకు ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ కోరారు. అన్ని అంశాలపై చర్చించేదుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మోడీ పేర్కొన్నారు. ఉన్నత ప్రమాణాలతో చర్చలు కొనసాగుతున్నాయని ఆశిస్తున్నట్లు మోడీ తెలిపారు.

Leave a Reply