అన్నయ్యలా కాకుండా ఈ ప్రయోగంలో సఫలం అవుతాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన ఆ ఎన్నికల్లో పోటి చేయకుండా టిడిపి,బిజేపి కూటమికి మద్దతు ఇచ్చి వారి విజయానికి తోడ్పాటు అందించిన విషయం తెలిసింది. అయితే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వంతంగా పోటి చేయాలని నిర్నయించుకోవడంతో మిత్ర పక్షాలైన టిడిపి, బిజేపి పార్టీలకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఒంటరిగా ఎదుర్కోవడానికి ఆ పార్టీలు ఇప్పడ్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గతంలో చిరంజీవిని దెబ్బ తీసిన విధంగా పవన్ కళ్యాణ్ ను దేబ్బతియాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అన్న చిరంజీవిలా కాకుండా గ్రామ స్థాయి నుండే పార్టీని పటిష్టం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకోసం ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ యాత్రలో ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి విషయాలను ప్రస్తావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కార్నర్ చేయ్యబోతున్నట్లు పవన్ కళ్యాణ్ సన్నిహితులు ప్రస్తావిస్తున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నట్లు సమాచారం.

Leave a Reply