మిషన్ భగీరథ పథకానికి ప్రారంభోత్సవం…

నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో తొలిసారిగా తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భాగిరథ పథకానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధాని ఆగష్టు 7వ తేదిన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అంతర్ రాష్ట్ర మండలి సమావేశం కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కేసీఆర్ సమావేశం అనంతరం ప్రధానిని కలిసి మిషన్ భగీరథ తొలిదశ పనులను ప్రారంభించాల్సిందిగా కోరారు. అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. మరో రెండు రోజుల్లో ప్రధాని కార్యాలయం నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదే పర్యటనలో ప్రధాని రామగుండం 4000 మెగా వాట్ల థర్మల్ పవర్ స్టేషన్ కు, వరంగల్ లో వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. అనతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉంది.

Leave a Reply