పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఘనంగా ప్రారంభం అయ్యింది. బేగంపేట్ విమానాశ్రయం నుండి గజ్వేల్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. గజ్వేల్ చేరుకున్న వెంటనే మోడీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ రైల్వే లైన్ కు శంకుస్థాపన చేశారు. వరంగంల్ లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. రామగుండంలోని థర్మల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరుగుతున్న బహిరంగ సభలో మోడీ పాల్గొంటున్నారు.

Leave a Reply