ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వివరాలు ఇవే..

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆగస్టు 7న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయాల్సిందిగా ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. సిఎం ఆహ్వానం మేరకు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఏడవ తేది మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3:00 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి తో కలిసి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు గజ్వేల్‌లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 6:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు.

ప్రధాని నరేంద్రమోడి తెలంగాణ రాష్ట్ర పర్యటన వివరాలు:

1. మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభం
2. ఆదిలాబాద్ జిల్లా జైపూల్ సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు జాతికి అంకితం
3. రామగుండంలో ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో నిర్మించే 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు శంఖుస్థాపన
4. ఫర్టిలైజర్ ప్లాంటుకు శంఖుస్థాపన
5. వరంగల్లోని కాలోజి నారయణ రావు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభం
6. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్‌కు శంఖుస్థాపన
7. గజ్వేల్‌లో బహిరంగ సభ

Leave a Reply