శర్మిష్టా ముఖర్జీని వేధించిన ఆకతాయి.

దేశంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఒకరైతే ఏకంగా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా ముఖర్జీని వేధించారు. ‘పార్థ మండల్’ అనే వ్యక్తి ఫేస్బుక్ లో శర్మిష్టా ముఖర్జీని వేధించారు. ఈ విషయాన్ని శార్మిష్టా ముఖర్జీ దృవీకరించారు. ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో ‘పార్థ మండల్’ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నాకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారు. అయితే మొదట పట్టించుకోకుండా బ్లాక్ చేశానని, అయితే ఇలాంటి విషయాన్ని వదిలేస్తే మరికొంత మంది ఇలాగే చేస్తారని అందుకే అతని వివరాలను బయట పెట్టి అవమానించాలని నిర్ణయించుకున్నాను అని, అతడి ప్రొఫైల్, మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తున్నానని, దీనిని అందరు షేర్ చేయాలని, ఇటువంటి విషయాలను తేలిగ్గా తీసుకోవద్దు’ అని శార్మిష్టా ముఖర్జీ పోస్ట్ చేశారు.

Leave a Reply